పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
14-07-2026 12:01 AM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం, జూలై 13 : కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమ వారం మండలంలోని రోటిగూడెం గీతానగర్లో గోనె మహేష్ - స్వప్న దంపతుల ఇందిరమ్మ నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ఎంఎల్‌ఎ కుటుంబ సమేతంగా హాజరై ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయనీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






