20 June, 2026 | 4:10 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

07-04-2026 12:29 AM

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్ పల్లి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే  ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కాల యాదయ్య హామీని ఇచ్చారు. సోమవారం శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కాలే యాదయ్య లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి సామూహిక గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు గూడు లభించిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ బీరయ్య,మున్సిపల్ చైర్మన్, సాత ప్రవీణ్ కుమార్,మాజీ ఎంపీటీసీ దశరథ్,గోపాల్ రెడ్డి, కే. గోపాల్, పరమేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు