calender_icon.png 25 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ర్టమంతా జబ్బు పడింది

25-08-2025 01:55:30 AM

-నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు 

-మాజీ మంత్రి హరీశ్‌రావు

-తిమ్మాపూర్‌లో మృతుల కుటుంబాలకు పరామర్శ

జగదేవపూర్, ఆగస్టు 24: సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య పాలనలో రాష్ర్టం జబ్బు పడిం దని, పారిశుద్ధ్యం కొరవడి విషజ్వరాలతో ప్రజలు చనిపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో డెంగ్యూతో మృతి చెందిన శ్రావణ్, మహేశ్ కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. గ్రామాలలో పారిశుధ్య చర్యలను పట్టించుకోకపోవడంతో గ్రామాలన్నీ రోగాలతో నిండిపోయాయన్నారు.

ప్రభుత్వం వెం టనే గ్రామాలలో అత్యవసరంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుందని, అధికారులు నిర్ల క్ష్యం చేయడం వల్ల గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందుల గురవుతున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రతిరోజు సందర్శించాలని సూచించారు. తిమ్మా పూర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణమే వైద్య సేవలు అందించాలని చెప్పారు.