calender_icon.png 25 August, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సార్వ బౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న మోదీ

25-08-2025 01:59:12 AM

-కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి

-సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.. వీరయ్య

-వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం

-ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య

ముషీరాబాద్, ఆగస్టు 24(విజయక్రాంతి): దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు మోడీ తాకట్టు పెడుతున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల వాయిస్ మాస పత్రిక 11వ వార్షికోత్సవం సందర్బంగా ‘ట్రంప్ దుందుడుకు వైఖరి-ప్రపంచ దేశాలపై ప్రభావం‘ అనే అంశం పై సెమినార్ వికలాంగుల వాయిస్ మాస పత్రిక ఎడిటర్ యం.

అడివయ్య అధ్యక్షుతన జరిగింది. వికలాంగుల వాయిస్ మాస పత్రిక వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఊటగే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆర్ ప్రశాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ అమెరికా విధిస్తున్న సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతాయాని అన్నారు. దేశ సార్వబౌమాత్వాన్ని ట్రంప్ అగౌరవపరుస్తుంటే నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం 4050 మందికి అవయవాలు తొలగించారని, వెయ్యి మంది పిల్లలు ఎదో ఒక్క అవయవం కోల్పోయారని అన్నారు. పాలస్తినా పై ఇజ్రాయిల్ వేస్తున్న బాంబులు, గాజాలోని ప్రజలను వికలాంగులుగా మార్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనని ఫౌండేషన్ చైర్మన్ టి. అనురాధ, ఊటగే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆర్. ప్రశాంత్, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, కోశాధికారి ఆర్, వెంకటేష్, వికలాంగుల వాయిస్ మాస పత్రిక అసిస్టెంట్ మేనేజర్ స్వామి, అసిస్టెంట్ ఎడిటర్ రాజు, ఎన్ పి ఆ ర్ డి కేంద్ర కమిటీ సభ్యురాలు సాయమ్మ, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.