16 May, 2026 | 8:46 PM

కార్మికులపై పడుతున్న పనిభారం తగ్గించాలి

30-07-2025 05:48 PM

కంగ్టి (విజయక్రాంతి): కార్మికులపై పనిబారం తగ్గించేలా జనాభా ప్రతిపదికన కార్మికులను పెంచాలని సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీఓ శ్రీనివాసులు(MPDO Srinivasulu)కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా డివిజన్ నాయకులు కిందిదొడ్డి సతీష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామపంచాయతి కార్మికులను 2011 జనాభ ప్రాతిపదికన నియమించుకున్న కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు.

అప్పటి నుండి ఇప్పటి వరకు జనాభ పెరిగి, కాలనీలు పెరిగాయి ఐన అంతే మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందుకే కార్మికుల పనిబారం తగ్గించాలంటే పృస్తుత జనాభా ప్రకారం కార్మికులను నియమించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కార్మికులను నియమించాలని అన్నారు. ధరలకు అనుగుణంగా సమానపనికి సమాన వేతనం, వారికీ కావలసిన డ్రెస్ కోడ్, సబ్బులు, సర్పులు, బెల్లం నూనె,ఇలాంటి వస్తవులు ఇవ్వాలని డిమాండ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సిద్రామ్, ఏషాప్ప, రాజు, సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు.