calender_icon.png 11 May, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై చెత్త కుప్పలు ఎత్తరా?

09-05-2025 01:07:36 AM

-జీహెచ్‌ఎంసీ అధికారులను నిలదీసిన పద్మశాలి కాలనీ వాసులు

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, చెత్తాచెదారం. ఇదేనా స్వచ్చ సర్వేక్షణ్... నామ్‌కే వాస్తే ప్రచారం చేస్తే ఎలా అని జీహెచ్‌ఎంసీ శానిటైజేషన్ అధికారులను భోలక్ పూర్ డివిజన్ పద్మశాలి కాలనీవాసులు నిలదీశారు.

గురువారం పద్మశాలి కాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్ పై కాలనీ వాసులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ శానిటైజేషన్ సూపర్వైజర్ గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఎలు పెద్ద ఎత్తున హాజరయ్యా రు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో వారు మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయొ ద్దని సూచించారు.

అధికారుల మాట లు విన్న కాలనీ వాసులు, పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్ష, కార్యదర్శులు సుంద ర్ పటాలే, ఆర్ ఆంజనేయులు గోవర్ధన్‌తో మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి? అంటూ నిలదీశారు. రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తా చెదారం, చెత్తకుప్పలు కనిపిస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు తొల గించరా అని ప్రశ్నించారు.

గాంధీనగర్, పద్మశాలి కాలనీ, భోలక్‌పూర్, పార్శిగుట్ట తదితర ప్రాంతాలలో రోడ్లపైనే ఎక్కడ చూసి నా చెత్తా చెదారం కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. స్వచ్చ సర్వేక్షణ్ అంటే నామ్‌కేవాస్తే చేయడం కాదు, రోడ్లు, కాలనీలను  శుభ్రపరచాలని  డిమాండ్ చేశారు. కాలనీ వాసులు అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక మళ్లీ వస్తామంటూ వెనుదిరిగి వెళ్లి పోవడం గమనార్హం.