12-01-2026 12:00:00 AM
అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
కోనేరులో స్నానం ఆచరింస్తే.. చర్మ వ్యాధులు నయమవుతాయి భక్తుల ప్రగాఢ నమ్మకం
ఆదిలాబాద్, జనవరి 11 (విజయక్రాంతి) : పూసాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అం గరంగ వైభవంగా కొనసాగుతోంది. జాతర వచ్చిందంటేచాలు ఆదిలాబాద్ జిల్లాతోపాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఉమ్మడి జైనథ్ మండలంలోని నూతనంగా ఏర్పడిన బోరజ్ మండలం పరిధిలోకి వచ్చే పూసాయి గ్రామ శివారులో అతి ప్రాచీన ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం పుష్య మాసం నుండి మాఘ మాసం వరకు నెల రోజుల జాతర నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా జాతర సంద ర్భంగా ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు పోటెత్తుతారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యే క పూజలు చేశారు.
జాతర సందర్భంగా వెలిసిన ప్రత్యేక దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈ జాతరలో వచ్చే భక్తులు ముం దుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానం ఆచరించి ఎల్లమ్మ తల్లి దర్శనం చేయ డం వలన చర్మ వ్యాధులు నయమవుతాయి భక్తుల ప్రగాఢ నమ్మకం. జాతరప్రారంభమైన మొదటి ఆదివారంరోజున పూసాయి గ్రామస్థుల ఆధ్వర్యంలో మహిళల భక్తులు ఇంటి వాకిలి శుభ్రము చేసి తల స్నానం చేసి సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి మట్టి బోనా ల కుండలను తలపై ఎత్తుకొని డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీల మధ్య శ్రీ రేణుక ఎల్ల మ్మ తల్లి భోనాలు సమర్పించడంతో జాతర ప్రారంభమవుతుంది. మూడవ ఆదివారం ఆదిలాబాద్ జిల్లాతోపాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి వేలాదిగా భక్తులు తరలి రావడం తో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.