12-01-2026 12:00:00 AM
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
ఘట్ కేసర్, జనవరి 11 (విజయక్రాంతి) : బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ప్రజా సేవ చేయడమే తెలుసునని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని చౌదరి గూడలో సంక్రాంతి పండగ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ వి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ చౌదరిగూడలో మహిళలతో పండగ వాతావరణం నెలకొం దని, మేడ్చల్ అంటే మల్లన్న, మల్లన్న అంటే మేడ్చల్ అనే విధంగా మేడ్చల్ ఒక చరిత్ర అని గుర్తు చేశారు.
తొమ్మిది వందల బాక్స్ లతో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వా మ్యం చేసే విధంగా సందీప్ రెడ్డి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. ముగ్గుల పోటీలలో డి. సోన ( చౌదరిగూడ) మొదటి బహుమతి రూ. 25వేలు, శ్రవంతి, నవ్యలకు (వెంకటాద్రి టౌన్ షిన్ ఫేస్ 2) 2వ బహుమతి రూ. 15వేలు ల, 3వ బహుమతి రూ. 10వేలు, 4వ బహుమతి రూ. 5వేలు నగదు బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలకు చీరలను సందీప్ రెడ్డితో కలసి మల్లారెడ్డి చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, పోచారం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, మాజీ సర్పంచ్ లు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కొంతం వెంకట్ రెడ్డి, వంగూరి శివశంకర్, మాజీ ఎంపిటీసి బొడ్డు వినోద నాగార్జున, మాజీ కౌన్సిలర్లు మెట్టు బాల్ రెడ్డి, చింతల రాజశేఖర్, ఆకిటీ శైలజ బాల్ రెడ్డి, అబ్బవతి సరిత స్వామి, సుర్వీ సుధాలక్ష్మి, మోటుపల్లి పోచమ్మ, నాయకులు అబ్బవతి నర్సింహా, నర్రి కాశయ్య, ఎరుకల దుర్గరాజ్ గౌడ్, కోళ్ళ యాదగిరి, మంద స్వామిదాస్, డొంకని బిక్షపతి గౌడ్, నీరుడి శ్రీనివాస్, కందుల నవీన్, ఎస్వీఆర్ ఫౌండేషన్ సభ్యులు, టీం ఎస్‌ఎస్‌ఆర్ సభ్యులు తదితర నాయకులు, కార్యర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.