12-01-2026 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.