6 July, 2026 | 2:23 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

భైంసాలో చోరీ..

22-06-2025 04:52 PM

30 తులాల బంగారం అపహరణ...

బైంసా (విజయక్రాంతి): బైంసా పట్టణం(Bhainsa town) రాహుల్ నగర్ లో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని దొంగలు ఓ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితులు గజ్జరం తెలిపిన వివరాలు.. తాను భార్యతో కలిసి ఒకరోజు ముందుగా బంధువుల గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఎదురు ఇంటి వారు తమ ఇంటితలుపులు తెరిచినట్లు గమనించి సమాచారం ఇవ్వగా తాము వచ్చి చూశామన్నారు.

ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని అల్మారాలో దాచుకున్న 30 తులాల బంగారం దొంగలు ఎత్తుకుపోయారని వాపోయారు. సమాచారం అందుకున్న సిఐ గోపీనాథ్(CI Gopinath) ఎస్సై గౌస్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిసి ఫుటేజ్ పరిశీలించగా ముగ్గురు గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చేరబడినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.