calender_icon.png 19 November, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఘనంగా శివుడికి రుద్రాభిషేకం

19-11-2025 01:28:18 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో కార్తీకమాసం ను  పురస్కరించుకొని బుధవారం కొమురవెల్లి ప్రసాద్ అన్నపూర్ణ వారి కుమారుడు శ్రవణ్ కుమార్ మానస దంపతులు స్వామివారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం  అన్న పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజారి వల్లకొండ మఠం మహేష్ ప్రత్యేక పూజలు చేశారు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాలయం నిత్య భక్తులు  కొమురవెల్లి కరుణ, సముద్రాల పుష్పలత, గుణలత, కొమరవెల్లి రవీందర్, భక్త బృందం పాల్గొన్నారు, సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయాలతో పాటు అన్ని దేవాలయాల్లోనూ చివరి కార్తీక బుధవారంను పురస్కరించుకొని పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.