calender_icon.png 2 August, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టపరంగా జీవిస్తే భయపడాల్సిన అవసరం లేదు

01-08-2025 10:57:24 PM

నిబంధనలను తప్పకుండా పాటించాలి..

టూ టౌన్ సిఐ మహమ్మద్ ఇజాజుద్దీన్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): చట్టపరంగా జీవించే వారు భయపడవలసిన అవసరం లేదని టూ టౌన్ సిఐ మహమ్మద్ ఇజాజుద్దీన్(CI Mohammed Ijazuddin) అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాక్సీ స్టాండ్ ఏరియాలో “ప్రజా భద్రత-పోలీసు బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ... స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ టౌన్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, ఎఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది,పట్టణ ప్రజలు డ్రైవర్లు సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు డి.రాములు, బి.జగదీశ్, బాలరాజు, షి టీమ్ సభ్యులు, పాల్గొన్నారు.