06-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జి ల్లాలో యూరియాకు ఎలాంటి కొ రత లేదని, రబీ సీజన్ లో పంటల సాగుకు అనుగుణంగా యూరియా అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారిని సరిత తెలిపారు. జిల్లాలోని సీరోల్ మండలం కామేపల్లిలో సోమవారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డిఏఓ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ యూరియా కో సం రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఎక్కడికక్కడే గ్రా మాల్లో రైతులకు యూరియా పంపి ణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు యూరియా నిలువలను పరిశీలిస్తూ డిమాండ్‌కు తగ్గట్టుగా తెప్పిస్తున్నట్లు చెప్పారు. డీఏవో వెంట స్థానిక ఏవో చాయారాజ్ పాల్గొన్నారు.