calender_icon.png 9 January, 2026 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు

06-01-2026 12:00:00 AM

మహబూబాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. డ్రైవర్లకు ఆల్కహాల్ బ్రీత్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వ హించారు. బస్సుల రవాణా పత్రాలను, డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సాయి చరణ్, వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ అరుణ్ మాట్లాడుతూ వాహనదారులు రో డ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇ వ్వాలని, రోడ్డుపై వాహనం నడిపే సమయంలో అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలను నడపరాదని, జాగ్రత్తగా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికాకుండా చూడాలని సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.