05-01-2026 06:10:18 PM
మంథని,(విజయ క్రాంతి): మంథని లో నిస్వార్థ సేవకుడిగా సేవ చేస్తున్నాడు గట్టు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి నవోదయ విద్యాలయాలలో గత 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి విరమణ పొంది, అంబేద్కర్ స్పూర్తితో మంథలో సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. మంథని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ముందు ఉన్న కాల్వర్టు పై కప్పు గుంతపడి ప్రమాదం కారంగా ఉండటంతో గమనించిన గట్టు కృష్ణమూర్తి తన స్వంత ఖర్చులతో సోమవారం పైకప్పును వేసి గుంతను పూడ్చి వేషాడు. దీంతో అతనిని పలువురు అభినంది, నిస్వార్ధ సేవకుడు గట్టు కృష్ణమూర్తి అని ప్రశంసిస్తున్నారు.