20-08-2025 12:46:16 AM
డీఏఓ ఛత్రు నాయక్
దండేపల్లి, ఆగస్టు 19 : జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రస్తుత అవసరానికి మించి యూరియా బస్తాలను నిలువ చేసుకోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ పేర్కొన్నారు. మంగళ వారం మండలంలోని ముత్యంపేటలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన అనంతరం ఆయ న మాట్లాడారు. జిల్లాకు ఇప్పటి వరకు 19 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని, గతంతో పోలిస్తే ౨ వేల మెట్రిక్ టన్నులు అధికంగా వచ్చిందన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలని, వ్యవసాయాధికారుల సూచన మేరకు వాడాలన్నారు.డీఏఓ వెంట ఏడీఏలు గోపి, అనిత, ఏఓ అంజిత్ కుమార్ తదితరులున్నారు.
అధిక ధరలకు అమ్మితే చర్యలు..
లక్షెట్టిపేట, ఆగస్టు 19 : ఎరువులను రైతులకు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్ప వని జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచామని, డీలర్లు ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయిం చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు విధిగా స్టాక్ బోర్డ్ అప్డేట్ చేయాలన్నారు. ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం జెండా వెంకటాపూర్, ఇటిక్యాల, గుల్లకోట ద్వారా 300 టన్నుల యూరియాను రైతులకు ఇదివరకే పంపిణీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో ఏడీఏలు గోపి, మండల వ్యవసాయ అధికారి ఆర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.