20-08-2025 12:45:57 AM
నారాయణపేట.ఆగస్టు 19(విజయక్రాంతి): దామరగిద్ద మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. కేంద్రంలో ఏ ఏ ఎరువుల ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేసి ఇంత వరకు ఎన్ని బస్తాల యూరియా విక్రయించారని చూశారు. రోజూ వారీగా ఎంత యూరియా విక్రయించారో రిజిస్టర్ లో తప్పనిసరిగా రాయాలని దుకాణ యజమానికి సూచించారు.
గోదాంలో నిల్వ ఉంచిన 336 యూరియా బస్తాలను ఆమె పరిశీలించారు. పాస్ బుక్ లను చూసి రైతులకు యూరియా ఇ వ్వాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. యూరియా పక్క దారి పట్టకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ నుఆమెఆదేశించారు.