18 June, 2026 | 3:08 AM

ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు

18-06-2026 02:05 AM

 గృహప్రవేశాలకు రావడం ఆనందాన్ని కలిగిస్తుంది

 దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, జూన్ 17 : ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలం కరివేన, వెల్కిచర్ల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి, తమ సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తమ కుటుంబం తరపున (కొత్త బట్టలు పెట్టిన) నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.