calender_icon.png 14 May, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేడింగ్ విధానమే ఉండాలి

14-05-2025 12:00:00 AM

  1. మంత్రి దుద్దిల్ల శ్రీధర్  బాబుకు వినతి
  2. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి

ముషీరాబాద్, మే 13  (విజయక్రాంతి): వచ్చే సంవత్సరం నుండి 2025 గ్రేడింగ్ విధానమే ఉండాలని తెలంగాణ రికగ్నైసేడ్ కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బా బును కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారు వెల్లడించారు.

అనంతరం వారు మా ట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులతో బడ్జె ట్ స్కూల్  ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సర్వీస్ రూల్స్ ప్రకారం సన్మానించి అవార్డులు ఇవ్వాలన్నా రు. అదే విధంగా కార్పొరేట్ స్కూల్ లను నియంత్రించాలన్నారు. ఎస్సీఈఆర్టీ ద్వారా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. బడ్జెట్ పాఠశాలలో  10 నుంచి 15 శాతం ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని మంత్రిని   కోరినట్లు వారు తెలిపా రు.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పం దించిన మంత్రి  శ్రీధర్ బాబు మాట్లాడుతూ త్వరలో ప్రత్యేక  సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి   వెల్లడించినట్లు వారు  తెలిపారు. మంత్రి తో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగిత రాణా, శ్రీ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి లను కలిసినట్లు వారు తెలిపారు.