14-05-2025 12:00:00 AM
మలక్పేట్, మే 13 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాసం కల్పిం చేందుకు జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మలక్పేట ఎమ్మెల్యే అ హ్మద్ బలాల అన్నారు. మంగళవారం అక్బర్ బాగ్ డివిజన్లోని ఆఫీసర్స్ మెస్ లో ఎంఐఎం పార్టీ, ఇబ్నాత్ ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఎంఎం పార్టీ నిరంతరం. కృషి చేస్తుందని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించేందుకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక జాబ్ మేళాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఔత్సాహికుల అర్హతను బట్టి ఇంటర్వ్యూల ను నిర్వహించి వారి వారి కంపెనీలో ఉద్యోగం కల్పించారు.
మలక్పేట నియోజకవర్గం నుంచి కాకుండా ప్రాంతాల నుంచి కూడా యువత యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంట ర్వ్యూ లో అర్హత సాధించి ఉద్యోగం దక్కించుకున్న ఔత్సాహికులకు కార్పొరేటర్లు ఎంఏ సలాం షహీద్, మినాజుద్దీన్ లు నియామక పత్రాలను అందజేశారు.
అదేవిధంగా విదేశాల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగం పొందేం దుకు టాం కామ్ ప్రత్యేక కౌంటర్ ను ఏర్పా టు చేసింది. జర్మనీ, యూఏఈ, జపాన్, ఖతర్ తదితర విదేశాల్లో వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు, అర్హులైన వా రు ఉద్యోగం కోసం దరఖాస్తు తీసుకొచ్చిన అని టామ్ కం అధికారులు తెలిపారు.