01-08-2025 11:55:58 PM
వచ్చినా గెలుపు కాంగ్రెస్‌దే: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
హైదరాబాద్ (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదని, పార్టీ ఫిరాయింపులకు అంబాసిడర్ కేసీఆరేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఫిరాయింపులపై మాట్లాడే కనీస అర్హత లేదని విమర్శించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్, హరీశ్‌రావు కొత్త డ్రామాకు తెరతీశారని, కానీ తెలంగాణలో ఉపఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో 60 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దని మండిపడ్డారు. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు.
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, కమ్యునిస్టు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేసి అవినీతి డబ్బుతో కొనుగోలు చేసిన నీఛులు బీఆర్‌ఎస్ నాయకులని ఆయన దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది ముగ్గురు, నలుగురేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ దక్కనట్టుగానే బీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్లు కోల్పోతుందని చెప్పారు.