calender_icon.png 2 August, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా డంపింగ్ యార్డులు

02-08-2025 12:00:00 AM

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు          

చేగుంట, ఆగస్టు 1 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ లు మండలంలోని చాలా గ్రామాల్లో  నీరుపయోగంగా మారాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాల్లో సేకరించిన  చెత్తతో సేంద్రీయ ఎరువులు తయారుచేసి పంచాయతీలు ఆదాయం పొందాలనే సదుద్దేశంతో వీటిని రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశారు.

కాని చేగుంట మండలంలో ఉన్న చాలా గ్రామ పంచాయతీలలో వినియోగంలో ఉన్నట్లు కనిపించడం లేదు. మక్కారాజ్ పేట్ గ్రామంలో మల్లన్నగుట్ట వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం  చేపట్టారు. అప్పుడు హడావుడిగా పాలకవర్గం ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా  అక్కడ చెత్త పోసిన దాఖలాలు లేవు, ఇలా చాలా గ్రామాలు మండలంలో ఉన్నాయి, ఒక డంపింగ్ యార్డ్ నిర్మాణానికి గత రాష్ట్ర ప్రభుత్వం 2.50 లక్షలు ఖర్చు చేసింది,

మండలంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే డంపింగ్ యార్డ్ వినియోగంలో ఉన్నాయి. మిగతా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల  ప్రభుత్వ సొమ్ము వృధాగా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం గ్రామాల్లో ఉన్న తడి పొడి చెత్తను, ట్రాక్టర్ ద్వారా సేకరించి  తయారైన ఎరువులు, రైతులు విక్రయిస్తే పంచాయితీకి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది.

ఇటీవల డంపింగ్ యార్డులలో చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, వానపాముల ఉత్పత్తి చేసే విధానం గురించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన డంపింగ్ యార్డులను వినియోగించుకోలేక పోతున్నారు. గ్రామాల్లో స్వీకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తీసుకు రాకుండా గ్రామాల సమీపంలోని చెరువుల వద్ద, పాత వ్యవసాయ బావుల్లో, గుంతల్లో పడేస్తున్నారు.

అయినా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం  గ్రామాస్తులు విమర్శిస్తున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ అనేది  వ్యర్థ పదార్థాలను పారవేసే ప్రదేశాలని, సమర్థవంతంగా నిర్వహించడం వల్ల పర్యావరణాన్ని హాని కలగకుండా చూసుకోవడం. గ్రామాల్లో వ్యర్థ పదార్థాల సేకరణ, రవాణా శుద్ధి, పారవేయడం వంటివి ఉంటాయి. కానీ ఇవన్నీ పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలని మండలంలోని గ్రామస్తులుకోరుతున్నారు.