calender_icon.png 8 January, 2026 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్జాదిగూడలో విద్యుత్ అంతరాయాలు ఉండవు

07-01-2026 01:18:33 AM

మేడిపల్లి, జనవరి 6 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి పరిధిలోని ఫిర్జాదిగూడ మూసి పరివాహక ప్రాంతంలో ఇకపై విద్యుత్ అంతరాయాలు ఉండవని టీ జి ఎస్ పి డి సి ఎల్ డైరెక్టర్ నరసింహులు స్పష్టం చేశారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాడైపోయిన కండక్టర్లను తొలగించి ఏవి కేబుల్స్‌ను అమర్చడం ప్రారంభిం చామని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఇ కామేష్, ఏఈ సత్యనారాయణ రెడ్డి, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.