07-01-2026 01:18:58 AM
ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి ): రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సరిగా వసతుల్లేవని ఎమ్మెల్సీ వి జయశాంతి తెలిపారు. మంగళవారం శాసనమండలిలో స్పెషల్ మెన్షన్స్‌లో భాగంగా ఆ మె కాలేజీలపై మాట్లాడారు.
వసతులు, ఫ్యా కల్టీ లేకుండా ఇష్టానుసారంగా విద్యార్థుల నుంచి ఫీజులు దోపిడీ చేస్తున్నారని, ఇలాంటి కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఆయా కాలేజీల వివరాలను బహిర్గతం చేయాలని ఆమె కోరారు. తల్లి దండ్రులు ఇదంతా తెలియక వారి పిల్లలను ఆయా కాలేజీల్లో లక్షల్లో ఫీజులు చెల్లించి చదివిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.