27-11-2025 04:23:04 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామ పంచాయతీలకు 5 నామినేషన్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. అనుపురం, సంకేపల్లి గ్రామాలకు అనుపురం గ్రామ పంచాయతీలో నామినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయగా, రుద్రవరం ఆరేపల్లి గ్రామాలకు, రుద్రవరం గ్రామపంచాయతీలో నామినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అలాగే చింతల్టానా, కొడముంజ శాబాష్ పల్లి గ్రామాలకు, చింతల్టన గ్రామపంచాయతీ ను నామినేషన్ సెంటర్ గా మారుపాక, గుర్రవానిపల్లి చంద్రగిరి, గ్రామాలకు మారుపాక గ్రామపంచాయతీ నామినేషన్ సెంటర్ గా, చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి అదే గ్రామ పంచాయతీ నామినేషన్ సెంటర్ గా ఏర్పాటు చేశారు. అయితే నేటి నుండి మొదటి విడతలోనే ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది.