calender_icon.png 27 November, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం

27-11-2025 04:29:57 PM

ఓడితల ప్రణవ్ బాబు..

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం సాయి శక్తుల పని చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మాల్డాల్ చెరువు సుందరీకరణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాల నిశ్రీలం కలిగిన చెరువు ఎన్ని రోజులు అభివృద్ధికి నోసుకోలేదని, గొప్పగా పరిపాలించామని చెప్పుకునే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక హుజురాబాద్ పట్టణానికి రూపాయలు 15 కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు.

మోడల్ చెరువు కట్ట ఆధునీకరణ, చిల్డ్రన్స్ పార్క్, వాకింగ్ ట్రాక్ వంటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుజురాబాద్ పట్టణంలోని గంగోని కుంట కట్టను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పాలకులు బురద చల్లె రాజకీయాల తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని అన్నారు. అధికారులు అలసత్వం లేకుండా పనులను తరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. హుజురాబాద్ పట్టని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కింసారపు సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కాలిక్ హుస్సేన్, చందమల్ల బాబు సాయి పాల్గొన్నారు.