14-12-2025 01:16:21 AM
‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్. రవీంద్ర బెనర్జీ ముప్పానేని సారథ్యంలోని ఈ సంస్థ రూపొందిస్తున్న తాజాచిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ శనివారం విడుదలైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో రవికృష్ణ మాట్లాడుతూ ‘దండోరా ఈ ఏడాది అందరూ గుర్తుపెట్ట్టుకునే సినిమా అవుతుంది’ అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. ‘మార్క్ కే రాబిన్ చాలా మంచి మ్యూజిక్ చేస్తుంటారు. ఈ సాంగ్‌తో ఆయనకు చాలా మంచి పేరు వస్తుంది. కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని చ్చారు. కుల వ్యవస్థపై జరుగుతున్న చాలా లోతైన విషయాలను మంచి ఇంపాక్ట్ పాయింట్‌ను డైరెక్టర్.. హ్యూమరస్‌గా, కమర్షియల్‌గా చెప్పారు” అని చెప్పారు. ‘దండోరా టీమ్‌లో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాన’ని హీరోయిన్ మణిక తెలిపింది.
చిత్ర దర్శకుడు మురళీకాంత్ మాట్లా డుతూ.. “మార్క్ అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. పాటలోని ఇంటెన్సిటీ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. మరో పాటను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ.. “దండోరా టైటిల్ సాంగ్‌లో ఉన్న ఎమోషన్ సినిమాలోనూ కనిపి స్తుంది. సినిమా చేసేటప్పుడు మాకు కొన్ని సందేహాలుండేవి.
అయితే మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకంతో ముందడుగు వేశాం. అదే నిజమైంది” అన్నారు. నటుడు శివాజీ మాట్లాడుతూ.. “జనానికి సందేశాలు, సలహాలిచ్చే పరిస్థితిలో ఇవాళ సినిమా లేదు. తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ మూవీ ఇది. ఎమోషన్స్ ఏదైనా దండోరా వేసినట్లే ఉంటుంది. ఏ భాషలో వచ్చినా ఈ సినిమా ఆడుతుందనేది నా అభిప్రాయం.
ఇందులో కులాలు, మతాలు అనే కాన్సెప్ట్ ఉండదు. ఈ సినిమా కథ గురించి దేశం (ఫిల్మ్ ఫెటర్నిటీస్) మాట్లాడుతుందేమోనని అనిపిస్తోంది” అన్నారు. ‘డైరెక్టర్ నాకు స్టోరీ నెరేట్ చేసిన తర్వాత కంపోజ్ చేసిన సాంగ్ ఇదే’ అని మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ చెప్పారు. మైత్రీ శశిధర్, ఎడిటర్ సృజన, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.