17-06-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ జూన్ 16 (విజయ క్రాంతి) : వాగులు చిన్నవా పెద్దవా కాదు... వాటిలో ఇసుక ఎంతవరకు ఉందనేది ఇసుక అక్రమ రవాణా దారుల లక్ష్యం. అనుమతులు ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం వరకు ఇసుక రవాణా జరుగుతున్న అనుమతి లేని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఇసుక అక్ర మ రవాణా ఆరంభమవుతుంది.
ఇసుక అక్ర మ రవాణా వార్త వచ్చినప్పటికీ కూడా ఇది అధికారులకు శరమాములే ఆయనే విధంగా అయిపోయింది. భూత్పూర్ మండలం తో పాటు, మూసాపేట్, అడ్డాకల్, మిడ్జిల్, కో యిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుం ట్ల, మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో తో పాటు పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యధావిధిగా సాగుతుంది.
- సీఎం చెప్పిన అమలు జరగట్లే...
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక రవాణా అక్రమంగా జరిగేది లేదని గత కొన్ని రోజుల క్రితం ప్రకటన చేశారు. ఈ ప్రకటన కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది కానీ ఎక్కడ కూడా అక్రమ రవా ణా ఇసుక ఆగడం లేదని ఆరోపణలు బలం గా ఉన్నాయి. అందిన కాడికి ఇసుక జెసిబి ల సహాయంతో దర్జాగా వాగులలో తోడేస్తున్నారు.
ప్రజలే వచ్చి మా ప్రాంతాల్లో ఉన్న వాగుల్లో ఇసుక అక్రమంగా మొరం తేలే వరకు తవ్వేస్తుంరని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇసుక ఏమాత్రం అక్రమంగా రవాణా సాగుతుం దో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా అధికారులు స్పం దించి ఇసుక రవాణా ప్రక్రియను పూర్తిస్థాయిలో ప్రభుత్వ నియ మ నిబంధనల ప్రకారం అవస రమైన వారికి అందుబాటు లో ఉంచవలసిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
- దర్జాగా ఇసుక దందా...
ఇసుక దందా అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ న్యూస్ ఎప్పుడు వచ్చే దే కదా అని కూడా కొందరు అంటుంటారు. కాగా ఎప్పుడూ అక్రమం గా ఇసుక రవాణా జరుగుతుంది అని పత్రికల్లో చెబుతున్న ప్రజలు చదువుతున్న అధికారులకు తెలిసిన అడ్డుకట్ట మాత్రం పడటం లేదు.
కేవలం ఒకటి రెండు కేసులు పెట్టి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నాం సీజ్ చేశాం అంటూ ప్రకటనలు చేసుకొని కాలక్రమవైపేనా వేణు వెంట నే ఇది శరమాములే అనే విధంగా అధికారుల తీరు కనిపిస్తుందని పలువురు అసహ నం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రత్యేక నిఘా ఉంచాం..
భూత్పూర్ మండలంలో ఇసుక అక్ర మ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా అ క్రమంగా ఇసుక తరలింపు జరుగుతుందంటే మాకు సమాచారం ఇవ్వండి. వెం టనే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఇసుక తరలించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. నిబంధనల మేరకు ముందుకు సాగాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.
-రాఘవేందర్, ఎస్త్స్ర, భూత్పూర్ పోలీస్ స్టేషన్