21 May, 2026 | 10:27 AM

మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్‌ను నమ్మరు

21-04-2024 12:21 AM

l ఓటమికి రేవంత్ సాకులు వెతుకుతున్నారు

l త్వరలో వికసిత్ తెలంగాణ 

l బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కేసీఆర్ బస్సు యాత్ర కాదుకదా మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్  కే లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని తెలిపారు. 14 సీట్లు గెలుస్తామని, 100 రోజుల పాలన రెఫరెండం అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు చతికిలబడి ఓటమికి సాకులు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  మీడియాతో  ఆయన మాట్లాడారు.

తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ కాంగ్రెస్‌ను రెచ్చగొట్టేం దుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హరీశ్‌రావు బీజేపీ ఏజెంట్ అని రేవంత్ అంటే.. కాదు రేవంతే బీజేపీ ఏజెంట్ అని హరీశ్‌రావు అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రస్తావన లేకుం డా రాజకీయాలు నడిపే పరిస్థితి కనిపించడంలేదని పేర్కొన్నారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కరెప్ట్ పార్టీ అని ప్రజలు భావిస్తున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ఒకటే డీఎన్‌ఏ అని, ఆ రెండు కవల పిల్లలని విమర్శించారు. రాష్ట్రం లో కనీసం 12 సీట్లు సాధించే దిశగా బీజేపీ ముందుకుసాగుతుందని, వికసిత్ భారత్ మాదిరిగానే వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని లక్ష్మణ్ తెలిపారు.