22 August, 2026 | 12:59 AM

అనర్హులకు పదవి ఇచ్చారు..

22-08-2026 12:09 AM
  1. కాంగ్రెస్ నాయకురాలు విద్య 
  2. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో భగ్గుమంటున్న వర్గపోరు

ఎల్బీనగర్, ఆగస్టు 21: ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటుంది. అనర్హులకు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా నియమించారని, వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొత్త విద్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ... సాహెబ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తాను కోరగా.... అర్హత లేని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఇచ్చారన్నారు.

తాను పదేండ్లు యూత్ కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర కార్యదర్శిగా పని చేశానని, తనకు సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే, పని చేసే వారికి ఇవ్వకుండా స్పా సెంటర్లు నిర్వహించే వ్యక్తికి ఇచ్చారని, అతడిపై కేసులు ఉన్నట్లు వివరించారు. అతను నిర్వహించే స్పా సెంటర్లపై తనిఖీ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతని వెంట ఉన్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొత్త విద్య డిమాండ్ చేశారు.