calender_icon.png 20 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడ్‌పాకల్ గోదావరి నది వద్ద దేవుళ్లకి అవమానం

20-12-2025 01:00:45 AM

అర్మూర్, డిసెంబర్19 (విజయ క్రాంతి): మృతి చెందిన వారి అంతక్రియలకు ఎర్గట్ల మండలంలోని తడ్పకల్ గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదిలో బావికులు ఆస్తికల్ని సమర్పిసుంటారనేది అందరికి విధితమే. సమర్పించే వారు నది వద్ద పూజలు నిర్వహించి దేవుళ్ళ చిత్రపటాల్ని అక్కడే వదిలివెస్తారు. అది సరైంది కాదు. ఆ ఫొటోలపై మురికి చెత్తచెదారం కామ్మేస్తున్న వైనం ప్రజలకి బాధ కల్గుతుంది. కావున స్థానిక సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం కల్గించుకోని, సరైన మార్గంలో నివారించాలని అంబేడ్కరైట్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు అక్కడ జరిగే గంగ స్నానాలు కాకుండా ‘గోదావరి స్నానాలు‘ అని ఉచ్చరించాలని, సజీవ గోదావరి నదికి అసలైన గౌరవం ఇవ్వాలని జిల్లా ప్రజలకు అంబేడ్కరైట్లు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మూలనివాసి మాలజీ తమ ముత్తుబాయి తల్లీకి బౌద్ధ పద్దతిలో గోదావరి నదిలో ‘జల్ దాన్ విధి‘ నిర్వహించడానికి వచ్చినందుకు తడ్పకల్ గ్రామ అంబేడ్కర్ విగ్రహం వద్ద అభిమానులు అయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఓదార్పులో గ్రామ అంబేడ్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు గంగసాయులు, ప్రఖ్యత గాయకులు అంబటి రాజేశ్వర్, సంఘం సంతోష్, రోహిత్, సురేష్, ముంబై క్రైస్తవ నాయకులు గైని ప్రకాష్, బర్ల చిత్తం, జర్నలిస్ట్ మామిడి రాజు, మమత మాల తదితర్లు ఆమెకు నివాళి అర్పించారు.