05-09-2025 12:00:00 AM
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ రోల్ పోషించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ తాజాగా రిలీజ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా, దీన్ని స్టార్ హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇందులో అనుష్క ‘వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను’ అంటూ సీరియస్ డైలాగుతో శక్తిమంతమైన పాత్రలో కనిపించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; మాటలు: సాయి మాధవ్ బుర్రా; డీవోపీ: మనోజ్‌రెడ్డి కాటసాని; యాక్షన్: రామ్ క్రిషన్; ఆర్ట్: తోట తరణి; ఎడిటర్: చాణక్యరెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి.