calender_icon.png 6 September, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతస్య మరణం ధ్రువం ఆ కోవకు చెందిన చిత్రమే

06-09-2025 12:19:21 AM

జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యాక్ష న్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతీ ఝాంఘియానీ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. “మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయంటాం.

‘జాతస్య మరణం ధ్రువం’ ఆ కోవకు చెందిన సినిమా” అన్నారు. హీరో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ.. “మంచి కంటెంట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ఇది. స్క్రీన్ ప్లే ట్విస్టులు చాలా బాగుంటాయి. జేడీ చక్రవర్తి ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ‘గులాబీ’లో చేసిన బైక్ సాంగ్ వల్ల నేను బైక్స్ మీద 70 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశాను” అన్నారు.

‘ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది. జేడీ చక్రవర్తి స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు’ అని డైరెక్టర్ శ్రవణ్ తెలిపారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కంటెంట్ మీద మాకు అంత నమ్మకం ఉంది” అని చెప్పారు.