calender_icon.png 6 September, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థ్రిల్లింగ్ ఆల్కహాల్

05-09-2025 12:00:00 AM

హాస్యమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన హీరో అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘ఆల్కహాల్’. రుహానిశర్మ, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీశ్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్యకృష్ణ, వెంకటేశ్ కాకుమాను, కిరీటి వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తే.. ఇదొక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలుస్తోంది. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో టీజర్‌లో చూపించారు. 2026, జనవరి 1న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్; డీవోపీ: జిజు సన్నీ; ఎడిటర్: నిరంజన్ దేవరమానే; ఆర్ట్: విశాల్ అబానీ.