28-01-2026 12:00:00 AM
వివరాలు వెల్లడించిన నందిపేట ఎస్త్స్ర శ్యామ్‌రాజ్
నందిపేట్ జనవరి 27 ( విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో నివాస గృహాలతో పాటు ఆలయాల్లో, జిల్లా లోని ఇతర ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు నందిపేట్ ఎస్త్స్ర శ్యామ్ రాజ్ తెలిపారు. చోరీలకు సంబంధించిన వివరాలను మంగళవారం ఎస్త్స్ర శ్యామ్ రాజ్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఐలపూర్ గ్రామం సబ్ స్టేషన్ కెనాల్ కట్టా నందిపేట ఎస్త్స్ర శ్యామ్ రాజ్, ఎస్త్స్ర రామ్ తన సిబ్బంది తో వాహనాలు తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి ఒక వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిపై అనుమానం వచ్చి పట్టుకొని విచారించడం జరిగిందన్నారు.
అతను మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దర్పల్లి సాయిలు గా గుర్తించడం జరిగిందన్నారు.. అతనిని విచారించగా తాను నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో గుడిలలో, ఇండ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి 12 గ్రాముల బంగారం, 22 గ్రాముల వెండి, తోపాటు ఒక పల్సర్ బైక్ ఏపీ15 బిఇ1126 వాటిని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ శ్యామ్ రాజ్, ఎస్‌ఐ రామ్, ఆర్మూర్ రూరల్ క్రైమ్ పార్టీ హెచ్ సీ లు మల్లేష్, నరేందర్, సుదర్శన్, పీసీ అనిల్ లను సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అభినందించారు.