calender_icon.png 28 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలి

28-01-2026 12:00:00 AM

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్

నాగిరెడ్డిపేట,జనవరి 27 (విజయక్రాంతి): వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల మండలంలో భారీగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పర్యాయాన్ని వెంటనే అందజేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఏఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల,ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో అత్యధికంగా నష్టం వాటిల్లిందన్నారు.భారీ వర్షాల వల్ల 3 వేల,,500 ఎకరాల పంటలు పూర్తిగా నీట మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని,అంతేగాక రోడ్లు,చెరువు కట్టలు, చెరువులు,తెగిపోయిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని  ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి,ఆయా గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మహేందర్, గులపల్లి లక్ష్మీనారాయణ, సాయిలు,బాల్య నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే లో అవార్డులు పొందిన వారికి సన్మానం

77 రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు పొందిన ఏపిఎం రామ్ నారాయణ గౌడ్కు, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్,ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ కుమార్,ఐకెపి సీసీ దత్తులకు మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శాలువతో ఘనంగా సన్మానించారు.ఇలాగే మరెన్నో అవార్డులు పొందాలని అభినందనలు తెలియజేశారు.