25-11-2025 11:01:53 AM
హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో(Habsiguda) మంగళవారం విషాదం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక తన చదువు విషయంలో ఇంట్లో జరిగిన వివాదంతో మనస్తాపంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఇంట్లోని పెద్దలు పిల్లలపై ఒత్తిడి పెంచడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పదవ తరగతి చదువుతున్న ఆ బాలిక తక్కువ మార్కులు సాధించినందుకు తల్లిదండ్రులు తిట్టడంతో మనస్తాపం చెందిందని, ఈ విషయంపై మనస్తాపం చెందిన ఆమె ఈ తీవ్ర చర్య తీసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక విచారణ జరిపి, మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.