17-12-2025 11:11:06 AM
వృద్ధురాలిని వీల్ చైర్ లో తీసుకెళ్లి ఓటు వేయించిన ఎస్.ఐ వెంకట్రాజం
రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటూనే పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మూడో విడుత ఎన్నికలలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఒక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి రాగ వృద్ధురాలి వయస్సుపై బడటంతో ఆమె నడవలేక ఇబ్బంది పడుతుండటంతో అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ వెంకట్రాజం గమనించి వెంటనే స్పందించిన ఆయన స్వయంగా ఆమెను వీల్ చైర్ లో పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లారు. ఆమెకు స్వేచ్ఛగా ఓటు వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు దగ్గరుండి సహాయం అందించారు. "పోలీస్ అంటే సేవకు మరో పేరని" దానిని ఎస్ఐ వెంకట్రరాజం ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారని, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించిన లక్ష్యంతో ఎస్సై వెంకట్రరాజం చూపిన ఈ సేవా భావం స్థానిక ప్రజలను నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.