20-12-2025 01:24:02 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన నూతన సర్పం చులను, ఉపసర్పంచులను, వార్డు సభ్యులను శుక్రవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల విశ్వసనీయతను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమించాలని, ఈ నెలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, ఇది కార్యకర్తల సమిష్టి విజయం అని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యకర్తల కఠోర శ్రమతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మన అభ్యర్థుల గెలుపుకు బాటలు వేశాయని స్పష్టం చేశారు.
సన్మానం పొందిన నూతన సర్పంచులు, ఇర్పా కవిత, కలివేటి సరిత, జిమ్మా ఝాన్సీ, కోర్సా కృష్ణ, ఎనిక ఉషారాణి, భూరెడ్డి స్వాతి, తెల్లం నాగమణి, మచ్చా నరసింహరావు, ఎట్టి నరేష్, బానోత్ సదర్ లాల్, సబ్కా పిచ్చయ్య, కుంజా జాను, పోడియం పవన్, కొండ్రు అంజమ్మ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, బూరెడ్డి వెంకటరెడ్డి, గాదె వెంకటరెడ్డి, బట్టా సత్యనారాయణ, తూము వీరరాఘవులు, బచ్చు వెంకటరమణ ,మాదినేని రాంబాబు, కిలారు శేషగిరి, రాగం మల్లయ్య, మాదినేని సుబ్బారావు, సోడే వెంకటేశ్వర్లు, మానాది సైదులు, కుంజా భాస్కర్, ఎస్.కె. ఖదీర్, తెల్లం వీరభద్రం, ఏ కాంబరం, సామా కృష్ణారెడ్డి, గొల్లపల్లి నరేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.