తిరువీర్ వీర ప్రతాపం చూపించే చిత్రమిది
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్‌పీ దుర్గ నరేశ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మనం నిజాయితీగల కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక శుక్రవారం మనదే అవుతుంది. థియేటర్లు అన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. తిరువీర్‌కు ఆ రోజు ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నా. 17న థియేటర్లలో మా తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడని నమ్ముతున్నా” అన్నారు.
చిత్ర కథానాయకుడు తిరువీర్ మాట్లాడుతూ.. “గత రెండు సినిమాల విషయంలో నేను బాధపడ్డా. ‘ప్రీ వెడ్డింగ్ షో’ జనానికి తెలిసేలోగానే సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నా. ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా” అని తెలిపారు. ‘ఈ కథ, ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి.
సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంద’ని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు. ‘ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ’ అని డైరెక్టర్ దుర్గ నరేశ్ చెప్పారు. నిర్మాతలు రుద్రదేవ్, రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇది మంచి వినోదాత్మక సినిమా. రూ.వంద టికెట్‌కే రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నందినిరెడ్డి, రైటర్ కోన వెంకట్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, ఈటీవీ విన్ కంటెంట్ నితిన్ చక్రవర్తి, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, చిత్రబృందం పాల్గొన్నారు.






