2 September, 2026 | 9:35 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఎప్పటికీ ఈ విగ్రహమే ఉండాలి

10-12-2024 | 01:39am

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.

తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు గుర్తింపులేదని.. ఇదే విగ్రహం ఎప్పటికీ ఉండేలా ప్రభుత్వం చూడాలన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎలాంటి పరిపాలన జరిగిందో అందరూ చూశారన్నారు.