calender_icon.png 8 December, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలి

07-12-2025 07:58:50 PM

సిపిఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

సిపిఐ గూటికి చేరిన పలువురు లక్ష్మిదేవిపల్లి మండల నాయకులు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా పేదలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు గత 2 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ, హమాలీ కాలనీ, ప్రశాంత్ నగర్, లక్ష్మిదేవిపల్లి, లోతువాగు, సంజయ్ నగర్, సాటివారిగూడెం గ్రామాల్లో సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయా గ్రామాల ముఖ్య నేతలకు సూచించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు సిపిఐ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కూనంనేని పార్టీ కండువాలతో ఆహ్వానించారు.

కష్టకాలంలో ప్రజలు సిపిఐ పార్టీని ఆదరించారని ఇలాంటి సందర్భంలో కొందరు చేస్తున్న అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా, పేదలకు అండగ 2 సంవత్సరాలుగా చేస్తున్న పనులను గమనించి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకోవాలని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, అభివృద్ధికి పట్టం కట్టడానికి ప్రజల సైతం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మండల ముఖ్య నాయకులు, పంచాయతీ బరిలో ఉన్న సర్పంచ్ లు, వార్డు సభ్యులు, వారి మద్దతుదారులు, సిపిఐ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.