11 March, 2026 | 3:13 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

కరాటే పోటీల్లో స్టూడెంట్స్ కోకో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులకు పతకాలు

07-12-2025 08:03 PM

కోదాడ: ఖమ్మం పట్టణంలో ఆదివారం సుమన్ ఫోటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోదాడ పట్టణ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్స్ కోకో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ కైవసం చేసుకున్నట్లు కోచ్ మాధవి లత ఆదివారం తెలిపారు. తమ క్లబ్ నుండి నిహార్, నిశాంత్, నోహిత్, గోల్డ్ మెడల్స్ ఈశ్వర్ అంజలి, శిరీషలు గోల్డ్ మెడల్స్, గుణ సాయి విజయ రవళిలు సిల్వర్ మెడల్స్, విక్రాంత్, వెంకట నిహాల్, నికిత బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.

విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలను కరాటే కింగ్ సినీ నటుడు సుమన్, తెలంగాణ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జల్లెల శ్రీనివాసరావులు అందజేసి విజేతలను అభినందించినట్లు తెలిపారు. కోదాడ పట్టణంలో విద్యార్థులకు ఉత్తమ శిక్షణను ఇస్తూ జాతీయస్థాయిలో మెడల్స్ సాధించేందుకు ప్రోత్సహిస్తున్న స్టూడెంట్ కోఫో ఖాన్ క్లబ్ కోదాడ కోచ్మాధవి లతను ప్రశంసించారు. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించిన విద్యార్థులను కోదాడలో పలువురు అభినందించారు.