23-10-2025 12:23:23 AM
మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు
ఘనంగా టీఎంకెఎంకెఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మత్స్యకారుల వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎంకెఎంకెఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీఎంకెఎంకె ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్లో నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన లెల్లెల బాలకృష్ణ టీఎంకెఎంకెఎస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రతి మత్స్య సొసైటీ బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షల రూపాయలు జమచేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి టీఎంకెఎంకెఎస్ అనేక పోరాటాలు చేసిందని మత్స్యకారులకు అండగా ఉంటూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీ.ఎం.కె.ఎం.కె. ఎస్ జిల్లా అధ్యక్షురాలు గాండ్ల అమరామతి, ప్రధాన కార్యదర్శి కొప్పు పద్మ, నాయకులు రేణుక, అన్నపూర్ణ, నర్సింగ్ రావు, అరుణ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.