calender_icon.png 23 October, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

23-10-2025 08:13:50 AM

ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. ఎల్లారెడ్డి ఎస్ఐ, మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి మండలం లోని మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృత రావు, నర్సింగ్ తండ్రి  జీవరత్నం వయసు 48 సంవత్సరాలు. బుధవారం తన వ్యవసాయ భూమిలో అతను, తన భార్య ఇద్దరు పని చేసుకుంటూ ఉండగా అమృత రావ్ మధ్యాహ్నం  2 గంటలకు తన పొలంలోని బోరును ఆన్ చేయడానికి స్టార్ట్ డబ్బును పట్టుకొని బోర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయి అక్కడికక్కడే మరణించాడని అతని భార్య కొండ సునీత ఫిర్యాదులో తెలిపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు, చేపట్టినట్లు ఎస్సై తేలిపారు.