23-10-2025 08:22:01 AM
మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించిన ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madanmohan Rao) దృష్టికి రావడంతో తక్షణమే ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పరిసర ప్రాంతంలో ఆలయంలో మౌలిక వసతులు కల్పించాలని ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో పర్యావరణాన్ని పెంపొందించాలని భక్తులకు మట్టి అంటకుండా తగు వసతులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్, మహేష్ కుమార్ కు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశించారు. చరవానిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో పలు వీధుల్లో చెత్త మురాయిస్తుందని ఫిర్యాదులు రావడంతో పలు వార్డుల్లో ఉన్న చెత్త సమస్యను పలు రకాల ప్రజలకు పడుతున్న అవస్థలను ప్రత్యేక చొరవతో సరిత గతిన పనులు పూర్తి చేయాలని కమిషనర్ కు తెలిపారు.