23-10-2025 08:19:34 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని(Yellareddy constituency) నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామం చెందిన చాకలి కుమార్ మద్యానికి బానిసై, తరచుగా కుటుంబ సభ్యులతో గొడవపడుతూ జీవితంపై విరక్తి చెంది, ఉరి వేసుకొని ఆత్మహత్య చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. మృతుడి వయస్సు 19 సంవత్సరాలు తాండూర్ గ్రామ నివాసిగా రోజు కల్తీ కళ్ళు సేవిస్తూ బానిసై మృతి చెందినట్లు స్థానికులు గ్రామస్తులు పలువురు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట మండల ఎస్సై భార్గవ్ గౌడ్, సంఘటన స్థలానికి వెళ్లి మృతుడి వివరాలు కుటుంబ సభ్యులను స్థానికులు అడిగి తెలుసుకుని మృతుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి ఎల్లారెడ్డికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.