calender_icon.png 23 October, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్డెన్ సెర్చ్‌లో మద్యం బాటిళ్లు, వాహనాలు స్వాధీనం

23-10-2025 08:15:57 AM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని చవిటిగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున మణుగూరు సబ్‌ డివిజన్‌ పోలీసులు(Manuguru Sub-Division Police) ఐదు టీములుగా ఏర్పడి విస్తృత కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 9 ఆటోలు, 48 టూ వీలర్లు, 7 బీర్‌ బాటిల్లు, 13 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అశ్వాపురం సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో బయ్యారం సీఐ వెంకటేష్‌, ఎస్‌ఐ సురేష్‌, మణుగూరు ఎస్‌ఐ నరేష్‌, అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్‌, అలాగే సుమారు 40 మంది స్పెషల్‌ స్కాడ్‌, TSSP పోలీసులు, సివిల్‌ పోలీసులు పాల్గొన్నారు.

తదుపరి అశ్వాపురం పాత బస్టాండ్‌ వద్ద "డ్రగ్స్‌పై యుద్ధం – చైతన్య సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ  యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ వ్యసనానికి గురవుతున్న యువతను ఆదుకునే క్రమంలో పోలీసులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సీఐ అశోక్‌ రెడ్డి, ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, అశ్వాపురం, మణుగూరు, ఏడుళ్ల బయ్యారం ఎస్‌ఐలు రాజేష్‌, నాగేష్‌, సురేష్ తదితరులు పాల్గొన్నారు.