calender_icon.png 19 February, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి

19-02-2026 02:48:21 AM

  1. బడ్జెట్‌లోనూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి 
  2. బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి 
  3. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
  4. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో శ్రీనివాస్‌గౌ భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించడంతోపాటు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు.

బుధవారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ బడ్జెట్‌పై మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో తాము అధికా రంలోకి రాగానే ప్రతి ఆర్థిక సంవత్సరానికి బీసీల బడ్జెట్‌ను 20 వేల కోట్లు పెంచుతామని, మహాత్మ జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీ కులవృత్తుల ఉపాధి కోసం బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించిందని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కామారెడ్డి హామీని అమలు చేయడం లేదని ఆయన మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.

అంతేకాకుండా 2024-.25 బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 9,200 కోట్లు, 2025-.26 బడ్జెట్‌లో 11,4౦5 కోట్లు కేటాయించారని ఇం దులో కేవలం ప్రతి ఆర్థిక సంవత్సరం మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలకు మూడు శాతం ఎదురు కేటాయించి కేటాయించిన నిధులలో కూడా ఒక్క శాతం బీసీ ల అభివృద్ధికి ఖర్చు చేస్తే వారు ఎలా అభివృద్ధి చెందుతారని ఆయన ప్రశ్నించారు.

ఈ 2025.-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనైనా కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన విధంగా బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని ఇందుకోసం పీసీసీ అధ్యక్షులుగా ప్రభు త్వంతో బీసీల తరఫున చర్చించి న్యాయం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.

కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, ఎం భాగయ్య, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, దీటి మల్లయ్య, కాటేపల్లి వీరస్వామి, తారకేశ్వరి, ఉదయనేత, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.