01-07-2025 02:04:04 AM
ఆదిలాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు గంజాయి దొరకకపోవడంతో మత్తు ఇంజక్షన్ కోసం చోరీకి పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని మెడికల్ షాప్‌లలో చోరీకి పాల్పడిన యువకులను పట్టుకుని విచారించగా యువకుల మత్తు బాగోతం బయటపడింది. టూ టౌన్ సీఐ కరుణాకర్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు... పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైల్వే స్టేషన్ లో అనుమానిస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.
వీరిని విచారించగా ఈనెల 29న తెల్లవారుజామున రెండు మెడికల్ షాప్‌లో, ఓ కిరణ షాప్‌లో దొంగతనం జరిగిందన్నారు. పట్టుకున్న మహమ్మద్ మోయిజ్, షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్‌లను విచరించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. ఈ ముగ్గురు మత్తుకు అలవాటు పడి తరచూ దొంగతనాలు చేస్తూ ఉంటారని తెలిపారు. ఈ సమయంలోనే ముగ్గురు కలిసి రిమ్స్ హాస్పిటల్ పక్కనగల సాయి సేవ హాస్పిటల్ మెడిక ల్ షాప్‌లో అక్రమంగా ప్రవేశించి డెస్క్‌లో గల మొబైల్ ఫోను, రూ. 2 వేల నగదు, 3 టర్మైన్ ఇంజక్షన్లు, ఒక మెడజాలం ఇంజక్షన్‌ను దొంగలించరని తెలిపారు.
వీరందరికీ మత్తు పదా ర్థాలు సేవించే అలవాటు ఉన్నందున మత్తు లో ఉండడానికి ఇలాంటి ఇంజక్షన్లను మత్తు పదార్థాలను దొంగలించినారని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ 24 గంటల్లోనే దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందని తెలిపారు.